Wasim Akram: ఆ పునరావాస కేంద్రం భయంకరం.. పాకిస్థాన్‌లో కాబట్టే అలా: వసీమ్ అక్రమ్
ఆటోబయోగ్రఫీలో సంచలన విషయాలను వెల్లడించిన పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. కొకైన్ బారి నుంచి బయటపడేందుకు పునరావాసం కేంద్రంలో చేరిన అక్రమ్ భయంకరంగా గడపాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ మాజీ క్రికెటర్‌గా, ప్రస్తుత వ్యాఖ్యాతగా మనకు సుపరిచితుడే. కానీ తన జీవితంలోని చీకటి కోణాలను, అందులో నుంచి ఎలా బయటపడ్డాడో తెలియజేస్తూ జీవిత చరిత్రను ‘సుల్తాన్ ఏ మెమోయిర్’ పేరిట పుస్తకంగా ఇటీవల తెచ్చాడు. తన ఆటకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత సమాచారం కూడా ఇచ్చాడు. అలాగే కొకైన్‌కు బానిసగా ఎలా మారాడో కూడా వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో వసీమ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డ్రగ్స్ బారి నుంచి కోలుకోవడానికి తాను చేరిన పునరావాస కేంద్రం భయంకరంగా ఉందని, నెలలో వచ్చేస్తానని చెబితే దాదాపు రెండున్నర నెలలు అక్కడే ఉంచారని పేర్కొన్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా చట్టవిరుద్ధమని, అదే పాకిస్థాన్‌లో మాత్రం కాదని వ్యాఖ్యానించాడు.
‘‘ఇంగ్లాండ్‌లో ఓ పార్టీకి వెళ్లినప్పుడు కొకైన్ ఎడిక్ట్‌గా మారిపోయా. అందులో ఒక వ్యక్తి ‘ఒకసారి ప్రయత్నిస్తారా?’ అని అడిగాడు. అప్పటికే నేను ఆట నుంచి రిటైర్‌మెంట్ తీసుకొన్నా. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని కొకైన్‌ను రుచి చూశా. కేవలం ఒక్క గ్రామ్‌ను మాత్రమే తీసుకొన్నా. ఆ తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చా. ఆ సరకు ఏంటో తెలియదు కానీ.. ఇక్కడా అందుబాటులో ఉంది. కొకైన్ లేకుండా నేను ఉండలేనని అర్థమైంది. దానికి బానిసగా మారిపోయా. నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. దీని వల్ల నా భార్యను కూడా తీవ్రంగా బాధపెట్టా. చాలాసార్లు వాదన జరిగేది. ‘నీకు వైద్య సాయం’ అత్యవసరమని ఆమె చెప్పింది. మాకు దగ్గరలోనే ఓ పునరావాస కేంద్రం ఉంది. అందులో చేరాలని కోరింది. అయితే నెలరోజులు మాత్రమే ఉంటానని అంగీకరించా. కానీ నేను అనుకొన్నట్లుగా నెల కాకుండా దాదాపు రెండున్నర నెలలపాటు కేంద్రంలో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా ఇది చట్టవిరుద్ధం కానీ పాకిస్థాన్‌లో మాత్రం అలా కాదు. చివరికి నాకు పెద్దగా ఉపయోగపడిందీ లేదు. అక్కడ నుంచి రాగానే నాలోనే ఓ రకమైన సంఘర్షణ మొదలైంది. నా ఇష్టానికి విరుద్ధంగా అలాంటి భయంకరమైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చిందని బాధపడ్డా’’
నా జీవితంలో విషాదమదే
‘‘పశ్చిమ దేశాల్లో పునరావాస కేంద్రాలను చూస్తే మతి పోతుంది. విశాలమైన వరండాలు, నిపుణులు ఇచ్చే ఉపదేశాలు, జిమ్‌లు.. ఇలా ప్రశాంతంగా ఉండటానికి వీలుంటుంది. అదే పాక్‌లో కారిడార్‌తో కలిపి ఉన్న ఎనిమిది గదులు మాత్రమే ఉంటాయి. అక్కడ ఉండటం అత్యంత కఠినం. భయంకరంగా గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత నా జీవితంలో విషాదం నెలకొంది. నా భార్య మరణించింది. నేను తప్పుడు మార్గంలో ఉన్నానని తెలిసొచ్చింది. దాని నుంచి బయటపడాలని గట్టిగా నిర్ణయించుకొన్నా. విదేశాల్లో ప్రతి తండ్రి అన్ని పనుల్లో భాగస్వామి అవుతాడు. పొద్దున్నే లేచి పిల్లలను తయారు చేయడం, పాఠశాలకు తీసుకెళ్లడం, తీసుకొని రావడం, బట్టలను మార్చడం.. ఇలా ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం అది కేవలం ఆడవారి పనిగానే చూస్తాం. మగవాళ్లు బయటకెళ్లి సంపాదించుకొని రావాలి. నేను దాదాపు రెండేళ్లపాటు కుటుంబం కోసం ఏమీ చేయలేదు. వారి కోసం చివరిసారి ఎప్పుడు బట్టలు కొన్నానో కూడా గుర్తులేదు. పిల్లలు ఏం తిన్నారో కూడా తెలియదు. అయితే ఆ తర్వాత నేను వారి పాఠశాలకు, పేరంట్ మీటింగ్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇతర పిల్లల తల్లిదండ్రులు నాకు చాలా సహకారం అందించారు’’ అని అక్రమ్ వెల్లడించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!