Updated : 29/10/2021 21:28 IST

T20 World Cup: ఆరంభంలో టపటపా.. ఆఖర్లో అఫ్గాన్‌ మెరుపులు

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ మోస్తరు పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ ముందు 148 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా.. ఆఖర్లో కెప్టెన్‌ మహమ్మద్ నబీ (35), గుల్బదిన్ నయిబ్ (35) ధాటిగా ఆడారు. పాక్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్‌ రెండు, షహీన్ అఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, హాసన్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టుకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఇమాద్‌ వసీమ్‌ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్‌ హజ్రాతుల్లా జజాయి (0) డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్‌ మహమ్మద్‌ షెహజాద్ (8) కూడా ఔటయ్యాడు. షహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో అతడు బాబర్ ఆజామ్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అస్ఘర్‌ అఫ్గాన్‌ (10), రహ్మానుల్లా గుర్బాజ్‌ (10), కరీమ్‌ జనత్‌ (15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. అప్పటికి అఫ్గాన్‌ స్కోరు 10 ఓవర్లకు 65/5గా ఉంది. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న క్రమంలో నబీబుల్లా జద్రాన్‌ (22) కూడా ఔటయ్యాడు. షాదాబ్‌ ఖాన్‌ వేసిన 13వ ఓవర్లో అతడు మహమ్మద్‌ రిజ్వాన్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. అయితే, ఆఖర్లో అఫ్గాన్‌ బ్యాటర్లు మెరుపులు మెరిపించారు. కెప్టెన్‌ మహమ్మద్‌ నబీ, గుల్బదిన్ నయిబ్ వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేసిన పాకిస్థాన్ బౌలర్లు.. ఆఖర్లో పట్టు సడలించారు. దీంతో అఫ్గాన్‌ జట్టు చివరి 3 ఓవర్లలో 43 పరుగులు రాబట్టింది. దీంతో పాక్‌ ముందు అఫ్గాన్‌ జట్టు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని