T20 World cup: పాకిస్థాన్, న్యూజిలాండ్‌ ఔట్‌

ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్‌లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్‌ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

Published : 15 Jun 2024 02:51 IST

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో అమెరికా, అఫ్గాన్‌
వర్షంతో యుఎస్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు

లాడర్‌హిల్‌: ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్‌లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్‌ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వేరే మ్యాచ్‌ల ఫలితాలు ఈ జట్ల కథను ముగించాయి. పాపువా న్యూగినీపై అఫ్గానిస్థాన్‌ విజయంతో న్యూజిలాండ్‌కు దారులు మూసుకుపోగా.. అమెరికా, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ వర్షం వల్ల రద్దవడంతో పాకిస్థాన్‌ కథ ముగిసింది. అఫ్గానిస్థాన్, వెస్టిండీస్‌ల చేతిలో కివీస్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా ఉగాండా, న్యూజిలాండ్, పాపువా న్యూగినీలను ఓడించిన అఫ్గాన్‌ గ్రూప్‌-సిలో అగ్రస్థానంతో ముందంజ వేసింది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌ సైతం మూడు విజయాలతో ఇప్పటికే సూపర్‌-8లో స్థానం సంపాదించింది. అఫ్గాన్‌.. పాపువా న్యూగినీ చేతిలో ఓడితే కివీస్‌కు అవకాశముండేది. మరోవైపు గ్రూప్‌-ఎలో భారత్‌ మూడు విజయాలతో ఇప్పటికే ముందంజ వేయగా.. అమెరికా గ్రూప్‌ నుంచి రెండో బెర్తును దక్కించుకుంది. ఆ జట్టు కెనడా, పాకిస్థాన్‌లను ఓడించి భారత్‌ చేతిలో ఓడింది. శుక్రవారం ఆ జట్టు.. ఐర్లాండ్‌తో తన చివరి మ్యాచ్‌ ఆడాల్సింది. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్‌ రద్దయింది. దీంతో మొత్తంగా 5 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంతో ఆతిథ్య జట్టు ముందంజ వేసింది. అమెరికా ఈ మ్యాచ్‌లో ఓడితే.. పాకిస్థాన్‌కు అవకాశముండేది. ఆ జట్టు యుఎస్, భారత్‌ చేతుల్లో ఓడి.. కెనడాపై నెగ్గింది. చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై నెగ్గి నెట్‌ రన్‌రేట్‌లో అమెరికా కన్నా మెరుగ్గా ఉంటే పాక్‌ ముందంజ వేసేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని