Pakistan-New Zealand: హైదరాబాద్‌ చేరుకున్న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్లు

పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో గురువారం జరిగే తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

Updated : 27 Sep 2023 22:43 IST

హైదరాబాద్‌: పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో గురువారం జరిగే తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పార్క్‌ హయత్‌కు చేరుకున్న పాక్‌ జట్టు రాత్రి అక్కడే బస చేయనుంది. మంగళవారం రాత్రి న్యూజిలాండ్‌ జట్టులోని కొందరు ఆటగాళ్లు రాగా.. బుధవారం రాత్రి మిగతా ఆటగాళ్లు హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో న్యూజిలాండ్‌ జట్టు బస చేసింది. ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల నిర్వహణ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

గణేశ్‌ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్తు దృష్ట్యా గురువారం పాకిస్థాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగే వార్మప్‌ మ్యాచ్‌కి  క్రికెట్ అభిమానులకు అనుమతి లేదు. అభిమానులు లేకుండానే ఇరు జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 3న జరిగే వార్మప్‌ మ్యాచ్, 6, 9, 10తేదీల్లో జరిగే ప్రధాన మ్యాచ్ లకు క్రికెట్ అభిమానులకు అనుమతి ఉంది. క్రికెట్ అభిమానులు బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని