Published : 27 Jun 2022 01:39 IST

Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్‌ క్రికెటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకరు విజయవంతమైతే తమ సీనియర్లు తట్టుకోలేరని, వారు సంతోషంగా ఉండలేరని పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెజాద్‌ తెలిపాడు. ఈ విషయం తాను ఇదివరకే చెప్పినా మళ్లీ చెబుతున్నానన్నాడు. చాలా రోజులుగా జట్టులో చోటు కోల్పోయిన అతడు తాజాగా క్రికెట్‌ పాకిస్థాన్‌తో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై స్పందించాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విజయవంతమవ్వడానికి ధోనీనే కారణమని చెప్పాడు.

‘కోహ్లీ అద్భుతంగా రాణించడానికి ధోనీనే కారణం. అతడు అండగా ఉంటూ మద్దతివ్వడం వల్లే విరాట్‌ విజయవంతమయ్యాడు. కానీ, దురదృష్టం కొద్దీ పాకిస్థాన్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ జట్టులోని సీనియర్లు, మాజీ ఆటగాళ్లు.. ఎవరైనా అద్భుతంగా ఆడితే తట్టుకోలేరు. వారు విజయవంతమైతే సహించలేరు. అలాగే విరాట్‌ రెండేళ్లుగా ఫామ్‌ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. అదే నా విషయంలో రెండు మ్యాచ్‌లు ఆడకపోయేసరికే పక్కనపెట్టారు. నన్ను దేశవాళీ క్రికెట్‌లో ఆడమన్నారు. అక్కడ నేను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినా పాకిస్థాన్‌ తరఫున ఆడటానికి  మరో అవకాశం ఇవ్వలేదు’ అని షెజాద్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని