Asia Cup 2022: 38 పరుగులకే హాంకాంగ్‌ ఆలౌట్‌.. సూపర్‌-4కు పాక్‌

పసికూన హాంకాంగ్‌ను పాకిస్థాన్‌ 155 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో గ్రూప్‌-ఎ నుంచి పాక్‌ రెండో జట్టుగా సూపర్‌-4కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

Published : 03 Sep 2022 01:21 IST

షార్జా: పసికూన హాంకాంగ్‌ను పాకిస్థాన్‌ 155 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో గ్రూప్‌-ఎ నుంచి పాక్‌ రెండో జట్టుగా సూపర్‌-4కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. పాక్‌ జట్టులో రిజ్వాన్‌(78 నాటౌట్‌), ఫఖర్‌ జమాన్‌(53) అర్దశతకాలతో చెలరేగారు. ఖుష్‌దిల్‌(35 నాటౌట్‌) చివర్లో చెలరేగి ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హాంకాంగ్‌ జట్టు కేవలం 10 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో షాబాద్‌ ఖాన్‌ 4, మహమ్మద్‌ నవాజ్‌ 3, నసీమ్‌ షా 2 వికెట్లతో హాంకాంగ్‌ను వణికించారు. రిజ్వాన్‌  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న భారత్‌ రెండు విజయాలతో తొలుత సూపర్‌-4కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక గ్రూప్‌-బి నుంచి అఫ్గాన్‌, శ్రీలంక జట్లు సూపర్-4కు చేరుకున్నాయి. సూపర్‌-4లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాక్‌ జట్లు ఈ నెల 4న మరోసారి తలపడనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని