Shoaib Akhtar: పాక్‌ బౌలర్లు భారత బౌలర్ల మాదిరి కాదు.. మరోసారి నోరుపారేసుకున్న అక్తర్‌

సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై రోహిత్‌ సేన దారుణ ఓటమి అనంతరం.. భారత ఆటగాళ్లే లక్ష్యంగా అక్తర్‌ తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. తాజాగా భారత బౌలర్లపై నోరుపారేసుకున్నాడు.

Updated : 13 Nov 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌ల్లో ఇంగ్లాండ్‌తో పాక్‌ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మరోసారి టీమ్‌ఇండియాపై నోరుపారేసుకున్నాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై రోహిత్‌ సేన దారుణ ఓటమి అనంతరం.. భారత ఆటగాళ్లే లక్ష్యంగా అతడు తన అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు.

ఫైనల్‌ల్లో పాక్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఇంగ్లాండ్‌ అర్థం చేసుకుందని అక్తర్‌ అన్నాడు. సెమీస్‌లో మాదిరిగా వారు భారత బౌలర్లను ఎదుర్కోవడం లేదని.. ఇక్కడ ఉన్నది పాక్‌ బౌలర్లని పేర్కొన్నాడు. ‘సెమీస్‌తో పోల్చితే ఇంగ్లాండ్‌ మంచి స్థితిలో ఉంది. వారి ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతోంది. అయితే, ఇంగ్లాండ్‌కు తెలుసు.. పాక్‌ బౌలర్లు టీమ్‌ఇండియా బౌలర్ల మాదిరి కాదని. విజయం సాధించడం అంత సులభం కాదు. వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది’ అని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌ను కూడా భారత బౌలర్లు తీయలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్తర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇక పాక్‌ విజయావకాశాలపై అక్తర్‌ మాట్లాడుతూ.. ‘బాబర్‌, రిజ్వాన్‌ల బ్యాటింగ్‌పైనే అది ఆధారపడి ఉంది. న్యూజిలాండ్‌పై ఈ ఇద్దరూ సాధించిన స్ట్రైక్‌ రేట్‌ చాలా ముఖ్యమైంది. అదే స్ట్రైక్‌ రేటు కొనసాగించేందుకు మెల్‌బోర్న్‌ పిచ్‌ సహకరిస్తుంది’ అని వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని