ramiz raja: అప్పుడలా.. ఇప్పుడిలా.. మరోసారి చిక్కుల్లో పీసీబీ
పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది వైద్య ఖర్చుల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి చిక్కుల్లో పడింది
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది వైద్య ఖర్చుల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి చిక్కుల్లో పడింది. ఆ దేశ హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ మోకాలి చికిత్సకు పీసీబీ వెంటనే స్పందించి రూ.10 లక్షలు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. టాప్ ఆటగాడి చికిత్సపై ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం కొత్త చర్చకు దారితీసింది.
ఇటీవల పాక్ జట్టు నెదర్లాండ్స్‌లో వన్డే మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన సమయంలో ముస్తాక్ మోకాలి సమస్యతో బాధపడ్డాడు. అక్కడ అతడికి చికిత్స అందించిన జట్టు వైద్యుడు నజీబ్ సుమ్రో సూచించిన కారణంగా బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా నిబంధనలను పక్కనపెట్టినట్టు సమాచారం. సాధారణంగా ఒప్పంద ఆటగాళ్లు, ఇతర ఉద్యోగులకు పీసీబీ మెడికల్ కవరేజీని అందిస్తోంది. అయితే వీటిని విడుదల చేయడానికి నిర్దిష్ట పద్ధతులు ఉంటాయి. ఇంత వేగంగా పీసీబీ నిధులను విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. అఫ్రిది తన వైద్య ఖర్చులను తానే భరించాడని ఇటీవల మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడి గాయాన్ని పట్టించుకోలేదని పాక్ విమర్శలపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
ఈ సీజన్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్‌ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. మూడు మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్‌గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్‌కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్‌కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్‌కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్‌కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్‌లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ