PCB - Shaheen: షాహీన్ షా అఫ్రిది.. టాప్-10 బ్యాటరట!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ జకా అష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆసియా కప్ షెడ్యూల్ ఈవెంట్ సందర్భంగా రెండు రోజుల కిందట మాట్లాడిన మాటలతో ట్రోలింగ్‌కు గురికాక తప్పలేదు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది (Shaheen Afridi) టాప్-10 బ్యాటర్. అదేంటి అతడు బౌలర్ కదా.. బ్యాటర్ల జాబితాలో టాప్ -10లోకి ఎలా వచ్చాడని అనుకుంటున్నారా..? క్రికెట్‌పై కనీస అవగాహన ఉన్నవారెవరైనా షాహీన్‌ను టాప్ బౌలర్‌గానే చెబుతారు. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జకా అష్రాఫ్ మాత్రం షాహీన్‌ను బ్యాటర్‌గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో షాహీన్ తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రెండు రోజుల కిందట జరిగిన ఆసియా కప్ షెడ్యూల్ ఈవెంట్ సందర్భంగా జకా అష్రాఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. తమ జట్టు గొప్పతనం గురించి చెబుతూ షాహీన్ అఫ్రిదిని టాప్ -10 బ్యాటర్‌గా అభివర్ణించారు.
ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు... భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
‘‘పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్ విషయానికొస్తే మా కెప్టెన్ బాబర్ అజామ్ ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అలాగే ఇతర బ్యాటర్లు కూడా గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఇక షాహీన్ షా అఫ్రిది కూడా టాప్ -10 బ్యాటర్. ఆసియా కప్, ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ అద్భుతంగా ఆడనుంది. ఆల్ ది బెస్ట్’’ అంటూ అష్రాఫ్.. ఆసియా కప్ ఈవెంట్‌లో మాట్లాడాడు. అయితే, టాప్ -10 బౌలర్ అనబోయి .. ఇలా బ్యాటర్‌గా పేర్కొనడంతో నెట్టింట ట్రోలింగ్‌కు గురికాక తప్పలేదు. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ జరగనుంది. భారత్ -పాకిస్థాన్ సెప్టెంబర్ 2వ తేదీన శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా తలపడతాయి.
పాక్ యువ మహిళా క్రికెటర్ వీడ్కోలు!
పాకిస్థాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీమ్ (18) పిన్న వయసులోనే క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడం అక్కడి క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే, కారణం మాత్రం తెలియరాలేదు. పలు వార్త సంస్థల కథనాల ప్రకారం.. మతపరమైన కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అయేషా కానీ.. పీసీబీ కానీ స్పందించలేదు. అయేషా పాక్ తరఫున కేవలం నాలుగు వన్డేలు, 30 టీ20లను మాత్రమే ఆడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
S Jaishankar: ఆయనో మోడ్రన్ ఆర్కిటెక్.. కేంద్ర మంత్రి జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు
-
PM Modi: పసుపు రైతుల కోసం.. ఎంతవరకైనా వెళ్తాం: ప్రధాని మోదీ
-
Annamalai: మహిళా జర్నలిస్ట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వివాదంలో అన్నామలై
-
Narayana - CID: మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు
-
Chandrababu-TDP: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల దీక్ష
-
Kerala: కుండపోత వర్షంలో జీపీఎస్‌ను నమ్ముకొని.. ప్రాణాలు పోగొట్టుకొన్న యువ డాక్టర్లు