Team India: సంజూ శాంసన్‌ ఇలా ఆడితే సరిపోదు.. మంచి ప్రదర్శన చెయ్యాలి

టీమ్‌ఇండియా ఆటగాడు సంజూ శాంసన్‌ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ సూచించాడు...

Published : 01 Mar 2022 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాడు సంజూ శాంసన్‌ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ సూచించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో శాంసన్‌కు అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధనాధన్‌ బ్యాటింగ్‌తో రెండో టీ20లో 39 పరుగులు చేసిన అతడు మూడో టీ20లో 18 పరుగులు చేశాడు. అయితే, తాజగా అతడి ఆటతీరుపై స్పందించిన సల్మాన్‌ బట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘సంజూ ఈ సిరీస్‌లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. కానీ, అతడు ఇలా 18, 19, 20, 30 పరుగులు చేస్తే సరిపోదు. అతడికి చాలా మంచి నైపుణ్యాలున్నా.. సరైన ప్రదర్శన చెయ్యలేకపోతున్నాడు. అతడు టీమ్‌ఇండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే జట్టులో రాణించాలి. అలా జరగాలంటే తన ఆటతీరు మెరుగుపర్చుకోవాలి. అలాగైతేనే టీమ్‌ఇండియాలో నిలదొక్కుకుంటాడు’ అని పాక్‌ మాజీ సారథి తన యూట్యూబ్‌ ఛానెల్లో పేర్కొన్నాడు. అలాగే టీమ్‌ఇండియాలో పోటీ చాలా ఉందని, అవకాశం కోసం యువకులు ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ‘ఇప్పటికే టీమ్ఇండియాకు ఆడాలని చాలా మంది యువకులు తమ అద్భుతమైన ఆటతీరుతో రాణించి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటప్పుడు సంజూ కూడా సుస్థిర స్థానం సంపాదించాలంటే విశేషంగా రాణించాలి’ అని సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని