IND vs PAK: భారత్ చేతిలో ఓడినా.. వారికి మద్దతుగా నిలవండి: పాక్ జట్టుకు మాజీ పేసర్ సూచన
ఆసియా కప్‌లో (Asia Cup 2023) భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఓడినా.. బాధపడకుండా ముందుకు సాగాలని పాకిస్థాన్ జట్టుకు మాజీ క్రికెటర్ కీలక సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచమంతా భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆసియా కప్‌లో (Asia Cup 2023) టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లోనే దాయాదితో పోరాడేందుకు సిద్ధమవుతోంది. శనివారం శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా చేతిలో ఒకవేళ పాకిస్థాన్ ఓడినా నిరాశ చెందకూడదని.. గెలవాలనే పట్టుదలతో ముందుకు సాగాలని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ సూచించాడు. అలాగే, ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి మానసిక స్థైర్యం అందించాలని చెప్పాడు. ఆసియా కప్‌లో బరిలోకి దిగిన జట్లలో సమతూకంగా ఉన్న టీమ్ పాక్ అని, కెప్టెన్ బాబర్ అజామ్ తన సభ్యులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.
ఆసియా కప్‌లో దాయాదుల పోరు.. ఎవరిది జోరు?
‘‘ఇప్పుడున్న పాకిస్థాన్ జట్టు సమతూకంగా ఉంది. అద్భుతమైన బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, మిడిలార్డర్ విభాగంతో కొనసాగుతోంది. పేస్ దళం గొప్పగా ఉంది. వారికి స్పిన్నర్లు అద్భుతంగా సహకారం అందిస్తున్నారు. ఇదే జట్టుతో బరిలోకి దిగితే సత్ఫలితాలను సాధించే అవకాశాలు ఎక్కువే. అయితే, పటిష్ఠమైన భారత్ చేతిలో ఒకవేళ ఓటమిపాలైతే.. మున్ముందు మ్యాచుల కోసం జట్టులో మార్పులు చేయొద్దు. అదే పట్టుదలతో సూపర్ -4లో తలపడాలి’’ అని అబ్దుల్ రజాక్ తెలిపాడు.
కోహ్లీని అధిగమించిన బాబర్.. సయీద్ అన్వర్ రికార్డుపై కన్ను
నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (151) ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో 2014 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌పై 136 పరుగులు చేశాడు. అయితే, ఆటగాడిగా మాత్రం విరాట్ కోహ్లీ పేరిటే ఆ రికార్డు కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో అత్యధికంగా విరాట్ ఒకే ఇన్నింగ్స్‌లో 183 పరుగులు సాధించాడు. ఇప్పుడు దీనిపై బాబర్ అజామ్ కన్నేశాడు. మరోవైపు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన పాక్ బ్యాటర్‌గా కొనసాగుతున్న సయీద్ అన్వర్‌ను సమం చేయాలంటే బాబర్‌కు ఒక్క శతకం అవసరం. సయీద్ అన్వర్ 20 సెంచరీలతో ఉండగా.. బాబర్ 19 శతకాలు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Janasena: తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ.. జాబితా ఇదే
-
Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్!
-
Hyderabad: హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ruturaj Gaikwad: ధోనీ నుంచి నేర్చుకున్నా.. కెప్టెన్సీలో నా స్టైల్ నాదే: రుతురాజ్ గైక్వాడ్
-
నోటీసు పట్టుకొని బండారు ఇంటికి పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత