Haris Rauf: ‘‘నన్ను ఇప్పుడు క్షమించేయ్’’.. నూతన వధువుతో పాక్‌ క్రికెటర్ ఫన్నీ వీడియో

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకొంటున్న పాకిస్థాన్‌ పేసర్‌ వివాహం చేసుకొన్నాడు. ఈ సందర్భంగా వధువుతో కలిసి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Updated : 25 Dec 2022 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ పేసర్ హారిస్‌ రవుఫ్ ఓ ఇంటివాడయ్యాడు. ముజ్నా మసూద్‌ మాలిక్‌తో శనివారం హారిస్‌ వివాహం జరిగింది. అయితే.. వీరి వెడ్డింగ్‌ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. వీడియో మధ్యలో ‘నన్ను క్షమించు’ అంటూ పెళ్లి కూతురుతో క్రికెటర్‌ నవ్వుతూ అన్న మాటలు ఫన్నీగా ఉన్నాయి. ఏదైనా పొరపాటు జరగ్గానే ‘మాఫ్‌ కరో’ అంటాం కదా.. అలా పెళ్లి అయిన వెంటనే సదరు పేసర్‌ తన సతీమణితో అనడం అందరిలోనూ నవ్వులు పూయించింది.

ఇక వీరి వివాహ కార్యక్రమానికి మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది, పేసర్ షహీన్ షా అఫ్రిది,  సమీన్‌ రానా, అతిఫ్ రానా, ఆఖిబ్ జావెద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు ఇద్దరు కలిసి దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు