Dhoni: ధోనీ సర్ మీరింకా యంగ్‌గా ఉన్నారు.. ప్లీజ్ ఇంకొన్నాళ్లు ఆడండి: పాక్ క్రికెటర్
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గురువారం 41వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు...
(Photo: Shahnawaz Dahani Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గురువారం 41వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు చెప్పారు. అయితే, మహీకి వీరాభిమాని అయిన ఒక పాకిస్థాన్ క్రికెటర్ సైతం జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం విశేషం. పైగా మహీని ఒక కోరిక కూడా కోరాడు.
షహనవాజ్ దహాని అనే పాక్ బౌలర్.. ‘ఆల్‌టైమ్ గ్రేట్ ఎంటర్టైనర్, ఫినిషర్, ఇన్సిస్ర్పేషన్, రోల్‌మోడల్ అయిన ధోనీ సర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. సర్ మీరింకా చాలా ఉత్సాహంగా, యవ్వనంగా ఉన్నారు. కాబట్టి మీరింకా కొన్నేళ్లయినా ఇలాగే ఆడుతూ మమ్మల్ని అలరిస్తూనే ఉండాలి’ అని ట్వీట్ చేశాడు. దీంతో అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ను 50 వేల మందికిపైగా లైక్ కొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్