MSD : ధోనీని కలిసిన వేళ.. నా కల నిజమైంది: పాక్‌ యువ పేసర్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ గురించి చెప్పాలంటే ...

Updated : 26 Feb 2022 11:16 IST

దిగ్గజ సారథి గురించి చెప్పాలంటే సమయం చాలదన్న షాహ్‌నవాజ్

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుందని 23 ఏళ్ల పాకిస్థాన్‌ యువ ఆటగాడు షాహ్‌నవాజ్‌ దహాని పేర్కొన్నాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గత టీ20 ప్రపంచకప్ సందర్భంగా ధోనీని కలిసిన క్షణాలను దహాని గుర్తుకు తెచ్చుకున్నాడు. భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తోనే ప్రపంచకప్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ధోనీ టీమ్‌ఇండియాకు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. టోర్నీలో భారత్  గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించగా.. పాక్‌ సెమీస్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమితో ఇంటిముఖం పట్టింది.  అయితే షాహ్‌నవాజ్‌కు పాక్‌ తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. 

ఎంఎస్ ధోనీని కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నట్లు, ఆ కోరిక టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా నెరవేరిందని షాహ్‌నవాజ్‌ తెలిపాడు. ఈ సందర్భంగా ధోనీ ఇచ్చిన సూచనలు చాలా విలువైనవని చెప్పాడు. ధోనిని కలవడం.. తన కల నిజమైన వేళ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి చెప్పాలంటే నాకు చాలా సమయం పడుతుంది. ధోనీని కలవాలనే కల నిజమైంది. జీవితంలో ఆ సంఘటనను మరిచిపోలేను. జీవితం గురించి.. పెద్దవాళ్లను ఏ విధంగా గౌరవించాలి.. క్రికెట్‌లో మంచి రోజులు, కలిసిరాని రోజులుంటాయని చెప్పాడు. అయితే ఆట పట్ల అంకితభావం ప్రదర్శించాలి. ఆటను ఎక్కువగా ప్రేమిస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకోగలవని వివరించాడు’’ అని దహాని పేర్కొన్నాడు. ఇక ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను కలవాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించాడు. కివీస్‌ పేసర్‌ షేన్‌ బాండ్‌ను చూస్తూ పెరిగానని, అతడు రిటైర్‌ అయ్యాక జోఫ్రా ఆర్చర్‌ తన పదునైన బౌలింగ్‌తో ఆకర్షించాడని దహాని వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని