పాఠశాల స్థాయి జట్టుతోనా?ఇదేం ఎంపిక: అక్తర్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టును ఆ దేశ దిగ్గజ పేసర్ షోయబ్‌ అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌‌ పాఠశాల స్థాయి క్రికెట్‌ ఆడుతోందని...

Published : 06 Jan 2021 01:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టును ఆ దేశ దిగ్గజ పేసర్ షోయబ్‌ అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌‌ పాఠశాల స్థాయి క్రికెట్‌ ఆడుతోందని అన్నాడు. జట్టు ఎంపికలో పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అవకతవకలు చేస్తుందనే విషయం తేటతెల్లం అవుతుందని దుయ్యబట్టాడు.

‘‘పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు సామర్థ్యం లేని సాధారణ ఆటగాళ్లను జాతీయ జట్టులోకి తీసుకువస్తోంది. ఆటగాళ్లందరూ అలానే ఉన్నారు. దీంతో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. టెస్టు క్రికెట్‌ ఆడితే జట్టులోని డొల్లతనం బయటపడుతోంది. ఆటగాళ్లంతా పాఠశాల స్థాయి క్రికెట్‌ ఆడుతున్నారు. ఇప్పుడు యాజమాన్యాన్ని మార్చాలని ఆలోచిస్తున్నారు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది?’’ అని అక్తర్‌ పాక్ బోర్డుపై తీవ్రంగా మండిపడ్డాడు. పాక్‌ క్రికెట్‌లో అక్రమాలు ఉన్నాయని ఇటీవల మాజీ పేసర్ మహ్మద్‌ ఆసిఫ్ కూడా విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పేసర్లు తప్పుగా వయసు నమోదు చేసి జట్టులోకి వస్తున్నారని ఆరోపించాడు.

కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ తొలి టెస్టులో 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 297 పరుగులు చేయగా, ఆతిథ్య జట్టు కివీస్‌ 659/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. విలియమ్సన్‌ (298) ద్విశతకంతో విజృంభించాడు. మూడో రోజు ఆటముగిసేసరికి పాక్‌ వికెట్‌ కోల్పోయి 8 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే ఇంకా 354 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇదీ చదవండి

42 ఏళ్ల నిరీక్షణకు రహానె తెరదించుతాడా?

రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు