Shoaib akthar: కార్టూన్‌లా ఆడుతున్నాడన్నాడు.. అతడికి బౌన్సర్లతో సమాధానమిచ్చా: షోయబ్‌ అక్తర్‌

పాకిస్థాన్‌ పేస్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ 2005 ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నాడు.

Published : 01 Dec 2022 01:16 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. చివరి సారిగా 2005లో టెస్టుల్లో తలపడిన ఈ దేశాలు పదిహేడేళ్ల విరామం తర్వాత మరోసారి ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ పేస్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నాడు. నాటి సిరీస్‌లో 17 వికెట్లు తీసి అదరగొట్టిన ఈ మాజీ ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 

టీవీ ముందు కూర్చుని జట్టులో తన పేరు ప్రకటిస్తారో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలను షోయబ్‌ తలచుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ఇంగ్లిష్‌ ఆటగాడు ఫ్రెడ్డీ ఫ్లింటాఫ్‌ తనపై చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకొన్నానని వివరించాడు. ‘‘మ్యాచ్‌లో నా ప్రదర్శనపై అతడు మాట్లాడుతూ.. చూడటానికి టార్జాన్‌లాగా ఉన్నాడు.. జేన్‌(కార్టూన్‌ పాత్ర) లాగా ఆడుతున్నాడు అని నాపై కామెంట్ చేశాడు. అతడికి ఎలాగైనా గట్టి సమాధానం ఇవ్వాలనుకున్నాను. నా బౌలింగ్‌లో ఆడటానికి వచ్చినప్పుడు అతడికి బౌన్సర్లు సంధించాను. మొదట కాస్త తడబడ్డాడు. చివరికి నా చేతిలో ఔటయ్యాడు. ‘మిస్టర్‌ ఫ్రెడ్డీ.. ఇప్పుడు చెప్పండి మీకు నేనెలా కనిపిస్తున్నాను?’ అని అడిగాను. అందుకు అతడు నన్ను క్షమాపణలు కోరాడు. మూడు వారాల వ్యవధిలో నా ఆటను మెరుగుపరచుకున్న తీరు చూసి నన్ను ప్రశంసించాడు’’ అంటూ షోయబ్‌ గుర్తుచేసుకొన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు