ICC: 2031 వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) మెన్స్‌ టోర్నీల్లో భాగంగా 2024 నుంచి 2031 వరకు ఆతిథ్యమివ్వనున్న దేశాల వివరాలను ఐసీసీ మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా 2031లో

Updated : 16 Nov 2021 19:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) మెన్స్‌ టోర్నీల్లో భాగంగా 2024 నుంచి 2031 వరకు ఆతిథ్యమివ్వనున్న దేశాల వివరాలను ఐసీసీ మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా 2031లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్‌తో కలిసి భారత్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నట్లు ప్రకటించింది. భారత్ 2011లో వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2023 వన్డే ప్రపంచకప్‌నూ భారత్‌లోనే నిర్వహిస్తుండటం.. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ (2031) నిర్వహణకు మన దేశం ఆతిథ్యమివ్వడం విశేషం.

ఐసీసీ ప్రకటించిన షెడ్యూలిదే..  

2024-టీ20 ప్రపంచకప్‌-యూఎస్ఏ, వెస్టిండీస్‌

2025-ఛాంపియన్స్‌ ట్రోఫీ-పాకిస్థాన్‌

2026-టీ20 ప్రపంచకప్‌-భారత్, శ్రీలంక

2027-ప్రపంచకప్‌-దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా

2028-టీ20 ప్రపంచకప్‌-ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌

2029-ఛాంపియన్స్‌ ట్రోఫీ-భారత్‌

2030-టీ20 ప్రపంచకప్‌-ఇంగ్లాండ్, ఐర్లాండ్‌, స్కాట్లాండ్

2031-ప్రపంచకప్‌-భారత్‌, బంగ్లాదేశ్‌

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని