PAK vs BAN: బంగ్లాపై పాక్‌ ఘనవిజయం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు అబిద్‌ అలీ (91), అబ్దుల్‌ షఫిక్‌ (73) రాణించడంతో 202 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి

Updated : 01 Dec 2021 08:54 IST

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు అబిద్‌ అలీ (91), అబ్దుల్‌ షఫిక్‌ (73) రాణించడంతో 202 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 109/0తో మంగళవారం, చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాక్‌.. 151 వద్ద షఫిక్‌ వికెట్‌ను కోల్పోయింది. కాసేపటి తర్వాత అబిద్‌ అలీ నిష్క్రమించాడు. అజహర్‌ అలీ (24 నాటౌట్‌), బాబర్‌ అజామ్‌ (13 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 330 పరుగులు చేయగా.. పాకిస్థాన్‌ 286 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 157 పరుగులకే ఆలౌటైంది. అబిద్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని