పాక్‌ కళ్లన్నీ భారత్‌ vs అమెరికా మ్యాచ్‌పైనే.. ఎందుకంటే..?

ఆడిన మూడింట్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిచిన పాకిస్థాన్‌ సూపర్‌ 8 దశకు చేరుకోవాలంటే చాలా సమీకరణాలు కలిసి రావాలి.

Updated : 12 Jun 2024 18:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో దాయాది పాకిస్థాన్‌ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో గెలిచి.. సూపర్‌ 8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే.. అదంత ఈజీ కాదు. ఇతర జట్ల ఫలితాలు కూడా తనకు కలిసి రావాలి.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ కళ్లన్నీ.. నేడు భారత్‌ vs అమెరికా మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే.. టీమ్‌ఇండియా, యూఎస్‌ఏ రెండేసి విజయాలతో గ్రూప్‌ A పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సూపర్‌ 8 దశకు చేరుతుంది.

ఈ మ్యాచ్‌తోపాటు ఐర్లాండ్‌పై కూడా యూఎస్‌ఏ ఓడిపోతే.. అప్పుడు పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది. పాక్‌ తన చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. రెండు జట్లూ నాలుగు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందుకెళ్తుంది. అంటే.. ఈ రోజు మ్యాచ్‌లో ఓడిన జట్టు.. తన తదుపరి మ్యాచ్‌లోనూ ఓడితేనే పాక్‌కు సూపర్‌ 8 అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా.. పాక్‌ తన చివరి మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. దీంతో నేటి మ్యాచ్‌ ఫలితంపై ఆ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఒకవేళ నేటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయితే.. పాకిస్థాన్‌ నేరుగా ఎలిమినేట్‌ అవుతుంది. ఎందుకంటే భారత్‌, అమెరికాకు చెరో పాయింట్‌ దక్కుతుంది. అప్పుడు అవి 5 పాయింట్లకు చేరుతాయి. పాకిస్థాన్‌ తర్వాత మ్యాచ్‌లో గెలిచినా.. 4 పాయింట్ల వద్దే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు