Wasim akram: పాక్‌ కొత్త తరం నన్నింకా నిందిస్తూనే ఉంది: వసీం అక్రమ్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ మరోసారి మ్యచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై స్పందించాడు.

Updated : 21 Nov 2022 13:21 IST

దిల్లీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ మరోసారి మ్యచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై స్పందించాడు. ఇతర దేశాల్లో తనను గొప్ప క్రికెటర్‌గా గౌరవిస్తారని అయితే, సొంత గడ్డపై మాత్రం ఇప్పటికీ కొందరు తనను మ్యాచ్‌ ఫిక్సర్‌గా ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందులో సామాజిక మాధ్యమాలు వాడే యువత కీలక పాత్ర పోషిస్తోందన్నాడు. 

‘‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌.. ఇలా ఏ దేశం తీసుకున్నా నా గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచంలోనే ఉత్తమ బౌలర్‌గా అభివర్ణిస్తారు. కానీ నేటి పాకిస్థాన్‌ తరం.. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను అనుసరించే తరం నుంచి నాకు అలాంటి స్పందన లేదు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోకుండానే నాకు సంబంధించిన ప్రతి పోస్ట్‌ కింద ‘అతడో మ్యాచ్‌ ఫిక్సర్‌’ అంటూ కామెంట్లు పెడుతుంటారు. అయితే, ఇటువంటి విషయాల గురించి చింతించాల్సిన దశను నేను ఎప్పుడో దాటేశాను’’ అంటూ వసీం ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపాడు. 

తన కెరీర్‌లో 356 వన్డేల్లో 502, 104 టెస్టుల్లో 414 వికెట్లు తీసిన ఈ పాక్‌ మాజీ పేసర్‌ అత్యుత్తమ ఆటగాడిగా పేరుపొందాడు. కానీ, 1996లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్‌గా వసీం మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ప్రయత్నించాడనే అరోపణలు ఎదుర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు