ఐసీసీ కొత్త అవార్డుల రేసులో పంత్, సిరాజ్‌

అభిమానులతో అనుబంధాన్ని మరింత పెంచుకునేందుకు ఐసీసీ కొత్త అవార్డులను తీసుకువచ్చింది. నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌’ అవార్డును అందించనుంది. ఈ పురస్కారాన్ని మహిళా...

Published : 27 Jan 2021 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులతో అనుబంధాన్ని మరింత పెంచుకునేందుకు ఐసీసీ కొత్త అవార్డులను తీసుకువచ్చింది. నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌’ అవార్డును అందించనుంది. ఈ పురస్కారాన్ని మహిళా, పురుషుల క్రికెట్ విభాగాల్లో అందివ్వనుంది. కాగా, ఈ జనవరి నెల అవార్డుకు ఎంపికైన నామినేటెడ్‌ ప్లేయర్లలో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. టీమిండియా నుంచి అయిదుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.

ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, రిషభ్‌ పంత్ ఎంపికయ్యారు. వీళ్లతో పాటు రహ్మదుల్లా (అఫ్గానిస్థాన్‌), జో రూట్ (ఇంగ్లాండ్‌), స్టీ‌వ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), మరిజనె కప్‌ (దక్షిణాఫ్రికా), నాడినె డిక్లెర్క్‌ (దక్షిణాఫ్రికా), నిదాదర్ ‌(పాకిస్థాన్‌) నామినేట్ అయ్యారు. కాగా, ఓటింగ్ ద్వారా ఐసీసీ విజేతను నిర్ణయిస్తుంది. ప్రతి నెల రెండో సోమవారం ఈ అవార్డులను ప్రకటిస్తుంది.

ఇవీ చదవండి

వాళ్లను గుర్తించలేకపోయాం: క్రికెట్ ఆస్ట్రేలియా

రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని