పంత్‌ గొప్పతనం అదే: సైని

టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఆటగాడని యువపేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. గాయపడ్డ తాను క్రీజులోకి వచ్చినప్పుడు అన్నీ అతడే చూసుకుంటానని పంత్‌ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఏ మాత్రం రిస్క్‌ తీసుకోవద్దని సూచించాడని వెల్లడించాడు....

Published : 28 Jan 2021 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఆటగాడని యువపేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. గాయపడ్డ తాను క్రీజులోకి వచ్చినప్పుడు అన్నీ అతడే చూసుకుంటానని పంత్‌ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఏ మాత్రం రిస్క్‌ తీసుకోవద్దని సూచించాడని వెల్లడించాడు.

గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో నవదీప్‌ సైని గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. పూర్తి స్థాయిలో బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేయలేదు. అయితే 328 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి 3 నిమిషాలు నవదీప్‌ సైని బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అయితే పంత్‌ విన్నింగ్‌ షాట్‌ బాదేసి విజయం అందించాడు. అతడికి శ్రమ లేకుండా చేశాడు.

‘రిషభ్‌తో బ్యాటింగ్‌ చేయడం అదే తొలిసారి. చాలా సరదాగా అనిపించింది. భారత్‌ను అతడు గెలిపిస్తాడని తెలుసు. క్రీజులోకి వెళ్లిన వెంటనే నేనేం చేయాలని పంత్‌ను అడిగా. రిస్కీ పరుగు అవసరం లేదని తాను పిలిచినప్పుడు పరుగెత్తమని బదులిచ్చాడు. బ్యాటింగ్‌ క్రీజులోకి వెళ్లి మళ్లీ తిరిగొచ్చి ఆందోళన వద్దని మొత్తం తాను చూసుకుంటానని చెప్పాడు’ అని సైని తెలిపాడు.

‘పంత్‌ విన్నింగ్‌ షాట్‌ కొట్టినప్పుడు పరుగెత్తు అని పిలిచాడు. వీలైనంత వేగంగా పరుగెత్తాలని నాకు తెలుసు. బంతి ఎటువైపు వెళ్లిందో చూడకుండానే పరుగెత్తా. సంబరాలు చేసుకొనేందుకు అతడు నన్ను ఆపినప్పుడు మేం గెలిచామని అర్థమైంది. పంత్‌ బౌలర్లను చితకబాదుతాడని తెలుసు. నిజానికి అతడు చాలా కష్టపడతాడు. మానసికంగా బలమైన ఆటగాడు. విపత్కర పరిస్థితుల్లో ఆడేందుకు ఇష్టపడతాడు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా అతడు మానసికంగా బలంగా నిలబడతాడు. అదే అతడిలోని అత్యుత్తమ గుణం’ అని సైని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?
భయం లేదు.. దాదా క్షేమం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని