- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
IND vs ENG: ఆదుకున్న పంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
బర్మింగ్‌హామ్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఆదిలోనే టాప్ఆర్డర్ కుప్పకూలడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌ను పంత్(146: 111 బంతుల్లో 20X4, 4X6)సెంచరీ, రవీంద్ర జడేజా( 83 నాటౌట్: 163 బంతుల్లో 10X4) అర్ధ సెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ చెలరేగడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న కీలక పోరులో ఇంగ్లాండ్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యాక కొద్దిసేపు వరణుడు అడ్డంకిగా మారాడు. అప్పటికే శుభమన్ గిల్ (17), ఛెతేశ్వర్ పూజారా (13) రూపంలో భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారి(20), విరాట్ కోహ్లీ(11) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. తరువాత వచ్చిన శ్రేయస్ అయ్యర్(15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడంతో భారత్ 98 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పంత్ విధ్వంసం.. అండగా జడేజా..
100 లోపే 5 వికెట్లు పడడంతో భారత్ 200 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహం మొదలైంది. అయితే అప్పుడే పంత్ విశ్వరూపం చూపించాడు. జడేజా అండగా క్రీజులో కుదురుకున్న పంత్ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 51 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పంత్.. 89 బంతుల్లోనే సెంచరీ చేశాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. మరోఎండ్‌లో ఉన్న జడేజా 109 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. మరోవికెట్ పడకుండా చెలరేగిన ఈ జోడీ జట్టు స్కోర్‌ను 300 పరుగులు దాటించారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 320 పరుగుల వద్ద రూట్ బౌలింగ్‌లో పంత్ ఔటయ్యాడు. అప్పటికే భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆరో వికెట్‌కు పంత్-జడేజా జోడీ 222 పరుగులు జోడించారు. దీంతో 1997 కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్- అజహరుద్దీన్ నెలకొల్పిన రికార్డును ఈ జోడీ సమం చేసినట్లైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్(1) స్టోక్స్ బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం షమీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మూడు వికెట్లు తీయగా, మ్యాటీ పాట్స్ రెండు వికెట్లు, బెన్ స్టోక్, జో రూట్ తలో వికెట్ తీశారు.
రిషభ్ పంత్ రికార్డు..
ఆసియాలో కాకుండా విదేశాల్లో భారత్ తరఫున మూడో వేగవంతమైన శతకం (89 బంతుల్లో) చేసిన వ్యక్తిగా పంత్ రికార్డు నెలకొల్పాడు. 2006లో వెస్టిండీస్‌పై సెహ్వాగ్ 78 బంతుల్లో సెంచరీ చేయగా, 1990లో ఇంగ్లాండ్‌పై అజహరుద్దీన్ 88 బంతుల్లో సెంచరీ చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad News: ప్రిన్సిపల్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి
-
India News
ఆ విచారణ విరక్తి పుట్టించింది..అవమానంతో చితికిపోయా..!
-
General News
గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం: జస్టిస్ ఎన్.వి.రమణ
-
Movies News
Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
-
Politics News
Rajasingh: మునావర్ కామెడీ షో అడ్డుకుంటామన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు
-
World News
Xi and Putin: బాలి సదస్సుకు జిన్‌పింగ్, పుతిన్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?