Paris Olympics 2024: సైన్యం 113.. మరి పతకాలు?

ప్రపంచంలో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌కు ఇంకో రెండు వారాలే సమయం ఉంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ ఈ నెల 26 నుంచే. పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.

Published : 09 Jul 2024 02:48 IST

ఈనాడు క్రీడావిభాగం
పారిస్‌ ఒలింపిక్స్‌ మరో 17 రోజుల్లో

ప్రపంచంలో అతి పెద్ద క్రీడా ఈవెంట్‌కు ఇంకో రెండు వారాలే సమయం ఉంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ ఈ నెల 26 నుంచే. పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. గత పర్యాయంతో పోలిస్తే ఈసారి ఒలింపిక్స్‌లో పోటీపడే అథ్లెట్ల సంఖ్య తగ్గింది. షెడ్యూల్‌ ప్రకారం 2020లో కాకుండా కొవిడ్‌ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక మంది పోటీ పడింది ఆ క్రీడల్లోనే. అందుకు తగ్గట్లే పతకాలు కూడా రికార్డు స్థాయిలోనే వచ్చాయి. ఒక స్వర్ణం సహా ఏడు పతకాలు భారత్‌ సొంతమయ్యాయి. ప్రస్తుతానికి పారిస్‌లో పోటీ పడబోతున్న అథ్లెట్ల సంఖ్య 113. టోక్యోలో ఆడే అవకాశం దక్కించుకున్న మహిళల హాకీ జట్టు ఈసారి బరిలో లేకపోవడం అథ్లెట్ల సంఖ్య తగ్గడానికి ఓ ముఖ్య కారణం. అయితే సంఖ్య తగ్గినా సమర్థులైన అథ్లెట్లకు లోటు లేదు. కాబట్టి ఈసారి టోక్యోకు దీటుగా పతకాలు సాధించగలమనే ధీమా భారత బృందంలో ఉంది. 2021లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్‌లో సువర్ణాధ్యాయాన్ని నిఖించిన నీరజ్‌ చోప్రా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు. గత క్రీడల్లో కాంస్యం సాధించిన హాకీ జట్టు ఈసారి పతకం రంగు మార్చాలనే పట్టుదలతో ఉంది. 2016, 2021లో నిరాశపరిచిన షూటర్లు ఈసారి పతకాలు కొల్లగొట్టాలనే కసితో ఉన్నారు. ఇంకా బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్‌లోనూ పతకాశలు రేపుతున్న క్రీడాకారులు చాలామందే ఉన్నారు. మరి ఈ బృందం అంచనాలను అందుకుంటుందా? పతకాల సంఖ్యను రెండంకెలకు తీసుకెళ్తుందా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు