Pat Cummins: కంగారూల కొత్త కెప్టెన్‌ కమిన్స్‌

ఊహించినట్లే ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథ్యం ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను వరించింది. ఆసీస్‌ టెస్టు జట్టుకు 47వ కెప్టెన్‌గా కమిన్స్‌ ఎంపికయ్యాడు. కమిన్స్‌ కెప్టెన్‌గా, మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితులైనట్లు

Updated : 27 Nov 2021 07:13 IST

స్మిత్‌కు ఉప సారథ్యం

మెల్‌బోర్న్‌: ఊహించినట్లే ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథ్యం ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ను వరించింది. ఆసీస్‌ టెస్టు జట్టుకు 47వ కెప్టెన్‌గా కమిన్స్‌ ఎంపికయ్యాడు. కమిన్స్‌ కెప్టెన్‌గా, మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితులైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఆసీస్‌ జట్టుకు పూర్తిస్థాయి సారథిగా ఎంపికైన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా కమిన్స్‌ రికార్డు సృష్టించాడు. 1956లో ఫాస్ట్‌ బౌలర్‌ రే లిండ్‌వాల్‌ ఒక మ్యాచ్‌ కోసం ఆసీస్‌ టెస్టు జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2017లో తోటి మహిళా ఉద్యోగికి అసభ్యకర సందేశాలు పంపిన వ్యవహారంలో గతవారం టిమ్‌ పైన్‌ సారథ్యం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక 2018లో దక్షిణాఫ్రికాలో బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో నిషేధానికి గురై సారథ్యం కోల్పోయిన స్మిత్‌కు ఇప్పుడు వైస్‌ కెప్టెన్సీ దక్కింది. ఇంగ్లాండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో డిసెంబరు 8న బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. ‘‘యాషెస్‌ సిరీస్‌కు ముందు సారథ్య పాత్రను అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నా. గత కొన్నేళ్లు పైన్‌ అందించిన సమర్థ నాయకత్వాన్నే కొనసాగిస్తానని అనుకుంటున్నా. నా సారథ్యం గత కెప్టెన్ల కంటే భిన్నంగా కనిపించొచ్చు. స్మిత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండాలని గట్టిగా కోరుకున్నా. అతనిపై ఎక్కువ ఆధారపడతా’’ అని కమిన్స్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని