Cummins-Langer: ఆసీస్‌ జట్టులో పిరికివాళ్లు ఎవరూ లేరు.. లాంగర్‌కు కమిన్స్‌ కౌంటర్‌

ఆస్ట్రేలియా జట్టులో కొందరు పిరికిపందలు ఉన్నారని మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ వ్యాఖ్యలకు కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు. టెస్టు జట్టు కెప్టెన్‌ అయిన కమిన్స్‌ నేతృత్వంలోని పలువురు సభ్యులు లాంగర్‌ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

Published : 29 Nov 2022 15:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. తన ముందు అంతా బాగుండేవారని, పక్కకు తప్పించడంలో వారే కీలక పాత్ర పోషిస్తారని అనుకోలేదంటూ లాంగర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే ఆసీస్‌ జట్టులో కొందరు పిరికివారు ఉన్నారని వ్యాఖ్యానించాడు. దీనిపై ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి ప్యాట్ కమిన్స్ కౌంటర్ ఇచ్చాడు. అప్పట్లో కమిన్స్‌ నాయకత్వంలోని జట్టు సభ్యులే కోచ్‌గా లాంగర్‌ పదవీకాలం పొడిగించవద్దని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. అతడి కోచింగ్‌ పద్ధతి సరైనదిగా భావించడం లేదంటూ పేర్కోవడంతో లాంగర్‌కు నిరాశే ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలవాలనే ఆసీస్‌ కల జస్టిన్‌ లాంగర్‌ కోచ్‌గా ఉన్నప్పుడే నెరవేరింది. 

‘‘ఆసీస్‌ జట్టులో ఎవరూ పిరికిపందలు లేరు. ఎప్పటికీ ఉండబోరు. లాంగర్‌ వ్యాఖ్యలు చాలా నిరుత్సాహానికి గురి చేశాయి. ఇలాంటివి చేస్తే జట్టు ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అయితే అప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించి మరీ లాంగర్‌ ఓ స్పష్టత ఇచ్చాడని అనుకొంటున్నా. దానికి కృతజ్ఞతలు. కానీ గత సంవత్సరకాలంగా జట్టు పనితీరు ఎంతో మెరుగుపడింది. ఆటగాళ్లు సగర్వంగా తలెత్తుకొని ఉన్నారని భావిస్తున్నా’’ అని కమిన్స్‌ వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు