Dhoni:ధోనీకి ఆ బంతిని అస్సలు వేయను: కమిన్స్‌

ప్రపంచంలో అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్లలో మహేంద్రసింగ్ ధోనీ ఒకడని నిస్సందేహాంగా చెప్పొచ్చు. ఎక్కువగా చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగే ధోనీ.

Published : 29 May 2021 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలో అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్లలో మహేంద్రసింగ్ ధోనీ ఒకడని నిస్సందేహాంగా చెప్పొచ్చు. ఎక్కువగా చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగే ధోనీ.. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. యార్కర్‌ బంతులను సైతం అలవోకగా సిక్సర్లుగా మలుస్తాడు. అప్పుడప్పుడూ హెలికాప్టర్ షాట్లతోనూ అలరిస్తూ మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడు. అందుకే ధోనీ క్రీజులో ఉన్నప్పుడు బౌలింగ్ చేయడానికి బౌలర్లు భయపడతారు.

ఒకవేళ ధోనీ స్ట్రెక్‌లో ఉండి ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమైతే.. అతనికి ఎలాంటి బంతిని విసురుతావు..? అని సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ని సరదాగా ప్రశ్నించాడు.  దాంతో కమిన్స్‌... ‘ధోనీ.. యార్కర్‌ బంతుల్ని సైతం అలవోకగా సిక్సర్లుగాగా మలిచిన వీడియోలను ఎన్నో చూశాను. కాబట్టి యార్కర్‌ బంతిని అస్సలు విసరను.  వీలైతే బౌన్సర్‌ లేదా స్లో బాల్‌ లేదా వైడ్‌ యార్కర్‌ని విసురుతాను. అన్నింటికీ మించి ఆ పరిస్థితుల్లో ధోనీకి బౌలింగ్‌ చేయాలని కోరుకోను’ అని సమాధానమిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని