Stunning Catch: స్టన్నింగ్‌ క్యాచ్‌.. మిస్సయితే తలకు గాయమయ్యేది!

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఓ ఆటగాడు అద్భుతమైన క్యాచ్‌ అందుకోని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

Updated : 17 Jun 2024 18:02 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందంటే అందుకు ప్రధాన కారణం ఆటగాళ్లు చేసే అద్భుత ప్రదర్శనలే. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఇలాంటి విన్యాసాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో తాజాగా ఓ సంచలనం చోటు చేసుకుంది. ఓ ఆటగాడు కళ్లుచెదిరే క్యాచ్‌ అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ క్యాచ్‌ అందుకోకపోతే ఫీల్డర్ తలకు గాయమయ్యేది! 

టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా జూన్‌ 16న డర్హామ్, లాంక్‌షైర్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో డర్హామ్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి లాంక్‌షైర్‌ 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. డర్హామ్‌ బౌలర్‌ పాల్ కోగ్లిన్ అద్భుతమైన క్యాచ్‌ అందుకుని లాంక్‌షైర్ బ్యాటర్ మాథ్యూ హర్ట్స్‌ని వెనక్కి పంపాడు. కోగ్లిన్‌ వేసిన పుల్‌టాస్‌ బంతిని బ్యాటర్‌ ముందుకు వచ్చి బలంగా బాదాడు. బంతి బుల్లెట్‌ వేగంతో బౌలర్‌ తల వైపు దూసుకొచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన  కోగ్లిన్‌ తనను తాను రక్షించుకోవడం కోసం కుడి చేతిని అడ్డుగా పెట్టాడు. దీంతో అక్కడేం జరిగిందనే విషయం కొన్ని క్షణాల వరకు ఎవరికీ అర్థం కాలేదు. మెరుపు వేగంతో వచ్చి బంతిని బౌలర్‌ చాకచాక్యంగా వ్యవహరించి అందుకున్నాడు. బంతి వచ్చిన వేగాన్ని బట్టి చూస్తే క్యాచ్‌ పట్టకపోతే బౌలర్‌ తలకు కచ్చితంగా గాయమయ్యేది!. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను డర్హామ్ జట్టు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని