Sachin: అర్జున్‌.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్‌ తెందూల్కర్‌

తల్లిదండ్రులు పిల్లలకు మద్దతుగా ఉంటూ స్వేచ్ఛనివ్వాలని సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) కోరారు. తనయుడు అర్జున్ తెందూల్కర్‌ గురించి మాట్లాడుతూ.. ఆటపై దృష్టిపెట్టాలని సూచించారు. 

Published : 03 Jun 2023 19:29 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) శనివారం తన కుమారుడు అర్జున్ టెందూల్కర్ (Arjun Tendulkar) క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడారు. ఆటపై శ్రద్ధ పెట్టమని అర్జున్‌కు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన స్వేచ్ఛను ఇవ్వాలని సచిన్ కోరారు. ‘సింటిలేటింగ్ సచిన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సచిన్‌ పాల్గొని మాట్లాడారు. పిల్లలు వారు కోరుకున్న రంగాల్లో రాణించడానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తనకు కుటుంబసభ్యులు మద్దతుగా నిలిచిన విషయాన్ని సచిన్ గర్తుచేసుకున్నారు. 

‘‘నాకు కుటుంబసభ్యుల నుంచి మద్దతు లభించింది. ఏదైనా సమస్య వస్తే  అజిత్ టెందూల్కర్ (తమ్ముడు)  చూసుకునేవాడు. నితిన్ టెందూల్కర్ (తమ్ముడు) నా పుట్టినరోజున నా కోసం పెయింటింగ్ వేయించాడు. మా అమ్మ ఎల్‌ఐసిలో, నాన్న ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. తల్లిదండ్రులందరూ ఇదే విధంగా తమ పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నా’ అని సచిన్ పేర్కొన్నారు. 

అర్జున్ తెందూల్కర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు నా తల్లిదండ్రుల ఎలాంటి స్వేచ్ఛనిచ్చారో అర్జున్‌ తెందూల్కర్‌కు కూడా అదే విధమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా. నీపై నీకు నమ్మకం ఉండాలి. అప్పుడే ఎదుటివారికి నీపై నమ్మకం ఏర్పడుతుంది. నా తండ్రి నువ్వు నీ ఆటపై దృష్టి పెట్టు అని చెప్పేవారు. ఇప్పుడు నేను కూడా అర్జున్‌కు అదే చెబుతున్నా’ అని సచిన్‌ అన్నారు. అర్జున్‌ తెందూల్కర్‌ ఎట్టకేలకు ఈ ఏడాది ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడిన మొదటి తండ్రీ-కొడుకుల జంటగా సచిన్-అర్జున్ రికార్డు సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని