KL Rahul వస్తాడనే.. Dhawan పని తేలిక చేస్తున్న షా

రెండు పాయింట్లు వస్తే బాగుండేదని పంజాబ్‌ కింగ్స్‌ సారథి మయాంక్‌ అగర్వాల్‌ అన్నాడు. ఓపెనర్లు శిఖర్‌, పృథ్వీ నిలకడగా శుభారంభాలు అందించడం చాలా బాగుందని దిల్లీ క్యాపిటల్స్‌ నాయకుడు రిషభ్ పంత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ...

Published : 03 May 2021 10:36 IST

ఇలాంటి శుభారంభాలు వస్తే ఎవ్వరికైనా ఆనందమే అంటున్న పంత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు పాయింట్లు వస్తే బాగుండేదని పంజాబ్‌ కింగ్స్‌ సారథి మయాంక్‌ అగర్వాల్‌ అన్నాడు. ఓపెనర్లు శిఖర్‌, పృథ్వీ నిలకడగా శుభారంభాలు అందించడం చాలా బాగుందని దిల్లీ క్యాపిటల్స్‌ నాయకుడు రిషభ్ పంత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. పిచ్‌ను బట్టి తన బ్యాటింగ్‌ ఉంటుందని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తెలిపాడు. పంజాబ్‌ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 17.4 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే.


రాహుల్‌ వస్తాడనే..!

(మయాంక్‌ అగర్వాల్‌: 99*; 58 బంతుల్లో 8×4, 4×6)

రాహుల్‌కు శస్త్రచికిత్స జరగనుంది. అతడు పునరాగమనం చేస్తాడని ధీమాగా ఉన్నాం. ఈ రెండు పాయింట్లు వస్తే బాగుండేది. కానీ, మేం కనీసం పది పరుగులు తక్కువే చేశాం. పవర్‌ప్లేలో దిల్లీ అద్భుతంగా ఆడింది. మాలో ఎవరో ఒకరు చివరి వరకు బ్యాటింగ్‌ చేయాలన్నది ప్రణాళిక. ఇది నారోజు. కానీ, మధ్య ఓవర్లలో మేం పరుగులు చేయలేకపోయాం. ఆఖర్లో దంచికొట్టాం. ఏదేమైనా ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలి. గెలుపు గురించి ఆలోచించాలి. హర్‌ప్రీత్‌ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మేం సమష్టిగా రాణించాలి. తర్వాత మ్యాచులో అలా ఆడతామని అనుకుంటున్నా.


అదిరే ఆరంభాలతో ఆనందం

(రిషభ్ పంత్‌: 14; 11 బంతుల్లో 1×4, 1×6)

శిఖర్‌, పృథ్వీ మాకు శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో బంతిపై పట్టు చిక్కింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అలాగే ఉంది. పిచ్‌ మందకొడిగా ఉన్నప్పటికీ మా ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. ప్రతి మ్యాచులో గొప్ప ఆరంభాలే లభిస్తుంటే ఎవ్వరికైనా సంతోషంగానే ఉంటుంది. చాలా ఇబ్బందులను పరిష్కరించుకున్నాం. కోల్‌కతా వేదికలో మరికొన్ని ప్రయోగాలు చేస్తాం. ప్రస్తుతం పోటీ బాగుంది. మాకు వేగంగా బంతులతో దాడిచేసే బౌలింగ్‌ బృందం ఉంది. అయితే, అందరినీ ఆడించడం కష్టం. సారథ్యాన్ని ఆస్వాదిస్తున్నా. ప్రతి రోజూ నేర్చుకుంటున్నా. అందరూ నాకు సాయం చేస్తున్నారు.


పృథ్వీ పని తేలిక చేస్తాడు

(శిఖర్ ధావన్‌: 69*; 47 బంతుల్లో 6×4, 2×6)

లక్ష్యాన్ని ఛేదించిన విధానం పట్ల సంతోషంగా ఉన్నాం. పృథ్వీ, నేనూ గొప్ప ఆరంభాలు ఇస్తున్నాం. స్మిత్‌ బాగా ఆడాడు. నేను ఆఖరి ఉండాలని తెలుసు. మంచి ఇన్నింగ్స్‌ నిర్మించడాన్ని ఆస్వాదిస్తాను. లక్ష్యానికి చేరువ కాగానే 19 ఓవర్లో మ్యాచును ముగించాలని అనుకున్నాం. కానీ హెట్‌మైయిర్‌ 18వ ఓవర్లోనే ముగించేశాడు. అతడు బంతిని అద్భుతంగా బాదాడు. స్ట్రైక్‌రేట్‌ పెంచినందుకు సంతోషం. ఎందుకంటే పరుగులతో పాటు స్ట్రైక్‌రేట్‌ సైతం కీలకమే. మనం పిచ్‌ను కచ్చితంగా గౌరవించాల్సిందే. అందుకే వికెట్‌ను బట్టి నా ఆట ఉంటుంది. పృథ్వీతో మూడేళ్లుగా కలిసి ఆడుతున్నా. అతడు నా పనిని తేలిక చేస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని