Ganguly: నేనూ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించా.. ఆ కారణం నాకు తెలుసు : గంగూలీ

వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని తొలగించడంపై విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు.

Updated : 13 Dec 2021 11:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని తొలగించడంపై విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి స్పందించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తెరవెనుక ఏమి జరిగిందో వెల్లడించారు. వన్డే ఫార్మాట్‌ నుంచి విరాట్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరించారు. విరాట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. టీ20 ఫార్మాట్‌ నాయకత్వాన్ని వదిలేయవద్దని నేను వ్యక్తిగతంగా విరాట్‌ను అభ్యర్థించాను. కానీ.. ఆ బాధ్యతలను అతను భారంగా భావించాడు. అలా అనుకోవడం మంచిదే. అతడో అద్భుతమైన క్రికెటర్‌. ఆటతో మమేకమై ఉంటాడు. అతడు చాలా రోజుల పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాక ఈ నిర్ణయానికి వచ్చాడు. నేను కూడా చాలా రోజులు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాను. అందుకే నాకు ఆ కారణం తెలుసు. వారు (సెలక్టర్లు) తెల్లబంతి ఫార్మాట్‌కు ఒకే కెప్టెన్‌ ఉండాలనుకున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ, ఒక్క విషయం చెప్పగలను. ఇదొక అద్భుతమైన జట్టు.. కొందరు ప్రతిభావంతులు కూడా ఉన్నారు. వారు ఏ లోటు రానీయరని ఆశిస్తున్నాను’’ అని గంగూలీ పేర్కొన్నారు.

కోహ్లీ టీ20  ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో మాట్లాడుతూ.. దాదాపు తొమ్మిదేళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడటం.. ఐదేళ్లకుపైగా నాయకత్వ బాధ్యతలతో ఒత్తిడి పెరిగిపోయిందని పేర్కొన్నాడు. తన కోసం కొంత సమయం వెచ్చించుకొని వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లకు నాయకత్వం వహించేందుకు పూర్తిగా సంసిద్ధమై వస్తానని వెల్లడించారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని