Border Gavaskar Trophy: కఠిన పిచ్‌పై.. సాధన షురూ చేసిన ఆస్ట్రేలియా

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా (Australia) జట్టు సాధన షురూ చేసింది. కఠినమైన పిచ్‌పై కఠోర సాధన చేస్తోంది.

Published : 03 Feb 2023 23:50 IST

బెంగళూరు: టీమ్‌ ఇండియా (Team India)తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా (Australia) సాధన షురూ చేస్తోంది. భారత్‌ స్పిన్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. దీనికోసం కర్ణాటకలోని ఆలూర్  స్టేడియం(Alur Stadium) లో పిచ్‌ను కఠినంగా తయారు చేయించి మరీ కఠోర సాధన చేస్తోంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు నెట్‌ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆస్ట్రేలియా సాధన చేస్తున్న పిచ్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌లా బౌలింగ్‌ చేసే.. మహేశ్‌ పితియాను బెంగళూరుకు రప్పించుకున్నారు. అతడి బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటర్లు నెట్‌ప్రాక్టీస్‌ చేస్తున్నారు. గతంలో జరిగిన చాలా మ్యాచ్‌ల్లో అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆసిస్‌ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఆ తరహా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా మహేశ్‌ పితియా బౌలింగ్‌లో సాధన చేస్తున్నట్లు సమాచారం. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాగ్‌పుర్‌ వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని