Kevin Pietersen : భారత ఆదాయపు పన్ను శాఖకు ధన్యవాదాలు: కెవిన్‌ పీటర్సన్‌

ప్రయాణంలో పాన్‌కార్డును పోగొట్టుకున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్‌.. 

Published : 16 Feb 2022 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, క్రీడా వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్‌ భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. క్రీడా బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కెవిన్‌ పీటర్సన్‌ ఐపీఎల్‌ మెగా వేలం కోసం భారత్‌కు వచ్చాడు. అయితే ఈ క్రమంలో పాన్‌ కార్డును పోగొట్టుకున్నట్లు పీటర్సన్‌ వెల్లడించాడు. 

 ‘‘ప్లీజ్‌ హెల్ప్‌. నా పాన్‌ కార్డును చేజార్చుకున్నా. కొన్ని కార్యకలాపాల కోసం భౌతికపరమైన పాన్‌ కార్డు కావాల్సి ఉంది. అయితే పాన్‌ కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. పీటర్సన్‌ ట్వీట్‌కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ‘‘డియర్‌ కేపీ, మీకు సహాయం చేసేందుకు మేం ఉన్నాం. మీ వద్ద పాన్‌ కార్డు వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్‌సైట్‌ లింక్‌లను ఓపెన్‌ చేసి ఫిజికల్‌ పాన్‌ కార్డు రీ ప్రింట్‌ కోసం ప్రయత్నించండి’’ అని రీట్వీట్‌ చేసింది. ఒక వేళ పాన్‌ కార్డుకు సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్‌ కోసం తమ శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. తన ట్వీట్‌కు స్పందించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు కెవిన్‌ పీటర్సన్‌ కృతజ్ఞతలు తెలిపాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని