IND vs AUS: ఇది 1980, 90ల నాటి పిచ్‌లా ఉంది.. భారత మాజీ స్టార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌ పిచ్‌పై టీమ్‌ఇండియా (Team India) మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Published : 10 Mar 2023 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌ వేదికగా భారత్,ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. మొదటి మూడు టెస్టుల్లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉన్న విషమం తెలిసిందే. నాలుగో టెస్టుకు మాత్రం పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. మొదటి రోజు ఆటను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తొలి రోజు వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు చాలా కష్టపడ్డారు. చివరకు నాలుగు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (104*), కామెరూన్ గ్రీన్‌ (49*) క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ పిచ్‌ గురించి భారత మాజీ క్రికెటర్‌, మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్‌ మంజ్రేకర్‌ (Sanjay Manjrekar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఇలాంటి పిచ్‌పై తొలి సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టడం గొప్ప విషయం. చాలాకాలంగా మనం ఇలాంటి పిచ్‌ను చూడలేదు. 1970, 80ల నాటి పిచ్‌లాగా కనిపిస్తున్న ఈ పిచ్‌పై మొదటి సెషన్‌లో భారత్‌ రెండు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చింది. అయితే, మొత్తంమ్మీద భారత బౌలర్లు వికెట్లు వచ్చే విధంగా బౌలింగ్‌ చేయలేదు’ అని మంజ్రేకర్ అన్నాడు. మరో కామెంటేటర్‌ మాథ్యూ హెడెన్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించాడు. టెస్టు క్రికెట్‌కు ఈ పిచ్‌ ఉత్తమమైనదని, ఇటు బ్యాటర్లకు.. అటు బౌలర్లకు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని