Kidambi Srikanth: మీ గెలుపు మరింత మందికి స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీకాంత్ గెలుపు ఎంతో మంది..

Updated : 20 Dec 2021 16:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీకాంత్ గెలుపు ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్‌కు అభినందనలు. ఈ విజయం ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. బ్యాడ్మింటన్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు ప్రకాశ్‌ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్‌ (2019) కాంస్యాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డబ్ల్యూటీఎఫ్‌లో రజత పతకం సాధించిన శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

మరో వైపు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా శ్రీకాంత్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ సహా మరికొందరు ప్రముఖులు శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు.

Read latest Sports News and Telugu News







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని