PM Modi: టీమ్‌ఇండియా భవిష్యత్‌ సురక్షితమైన వ్యక్తుల చేతుల్లో ఉంది

టీమ్‌ఇండియా యువకులు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవడంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ యువకులను ప్రత్యేకంగా అభినందించారు...

Published : 06 Feb 2022 10:42 IST

(Photo: BCCI Tweet)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువకులు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలవడంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఇక ప్రధాని నరేంద్రమోదీ యువకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ యువ ఆటగాళ్లని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. టోర్నీ ఆసాంతం గొప్ప ప్రదర్శన చేశారని మెచ్చుకున్నారు. ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంత అద్భుతంగా రాణించడం చూస్తుంటే టీమ్‌ఇండియా భవిష్యత్‌ సురక్షితమైన వ్యక్తుల చేతుల్లో ఉందని మోదీ కొనియాడారు. మరోవైపు పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ యువకుల విజయానికి ముగ్ధులయ్యారు.

ఎవరెవరు ఏమన్నారంటే..

* ఇంత గొప్పగా ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత్‌కు.. అలాగే ఈ విజయానికి కారణమైన సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు. మేం ఈ ఆటగాళ్లకు ప్రకటించిన రూ.40లక్షల నగదు బహుమతి కేవలం వారిని ప్రోత్సహించడానికే. కానీ, వారు సాధించింది అంతకన్నా ఎక్కువే. ఈ విజయం చిరస్మరణీయం. ఒత్తిడిలోనూ ప్రతి ఒక్క ఆటగాడు అద్భుతంగా రాణించాడు. -బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ

* ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన యువకులకు అభినందనలు. ఇది చాలా చాలా ప్రత్యేకమైన గెలుపు. అన్ని అడ్డంకులను దాటుకొని విజేతలుగా నిలిచారు. టీమ్‌ఇండియాలోని ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ఆడారు. దీంతో విపత్కర పరిస్థితుల్లోనూ గెలుపొంది చరిత్ర సృష్టించారు.   -సెక్రటరీ జైషా

* ఐదోసారి ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత్‌కు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన పోరాటపటిమ చూపించి విజయం సాధించారు. ఈ అద్భుతమైన క్షణాలను ఆస్వాదించండి బాయ్స్‌.   -వీరేందర్‌ సెహ్వాగ్‌

* టీమ్‌ఇండియా యువకులు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినందుకు శుభాకాంక్షలు. రవికుమార్‌, రాజ్‌ బవా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. టీమ్‌ఇండియా భవిష్యత్‌ గొప్పగా మెరుస్తోంది. బాయ్స్‌ మీరు చాలా బాగా ఆడారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది.   -యువరాజ్‌ సింగ్‌








Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని