PM Modi: కంగ్రాట్స్‌ రవి.. నీ విజయం దేశానికి స్ఫూర్తి: మోదీ ప్రశంస

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రజతం సాధించిన రెజ్లర్‌ రవి కుమార్ దహియాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి......

Updated : 05 Aug 2021 20:22 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రజతం సాధించిన రెజ్లర్‌ రవి కుమార్ దహియాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికి వెండి పతకం అందించిన దహియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గొప్ప పోరాట పటిమను, స్ఫూర్తిని ప్రదర్శించావంటూ కొనియాడారు. రవి దహియా ఓ గొప్ప రెజ్లర్‌ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. రజతం సాధించినందుకు కంగ్రాట్స్‌ చెప్పారు. అతడు సాధించిన విజయం పట్ల దేశం గర్వపడుతోందన్నారు. మరోవైపు, రవి కుమార్‌ దహియా, అతడి కోచ్‌ అనిల్‌ మాన్‌లతోనూ ప్రధాని ప్రధాని ఫోన్‌లో సంభాషించినట్టు సమాచారం. దహియా సాధించిన విజయం దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. 

దేశం కీర్తిని చాటేందుకు రవి పోరాడిన తీరు నిజంగా అసాధారణమైందని కేంద్ర హోంమంత్రులు అమిత్‌ షా, కిరణ్‌ రిజిజు సైతం కొనియాడారు. అతడి కఠోర శ్రమే సువర్ణాధ్యాయాన్ని సృష్టించిందని అమిత్‌ షా తెలిపారు. రవి సాధించిన విజయానికి గర్వపడుతున్నామని, భవిష్యత్‌లో చేయబోయే ప్రదర్శనలకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ‘‘దహియా.. నువ్వే ఇండియన్‌ హీరోవి. సిల్వర్‌ పతకం సాధించి భారత్‌ను గర్వపడేలా చేశావు. నీ అసాధారణ ప్రదర్శనకు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని రిజుజు పేర్కొన్నారు. 

రవి కుమార్‌ దహియా సాధించిన విజయం పట్ల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ట్విటర్‌లో అభినందనలు, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని