National games: 36వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 36వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో మన అథ్లెట్లు వందలోపు..

Published : 29 Sep 2022 21:38 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 36వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద  స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో మన అథ్లెట్లు వందలోపు ఈవెంట్లలోనే పాల్గొనేవారని, ఇప్పుడు 300కు పైగా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్నారని చెప్పారు. గుజరాత్‌లోని పలు వేదికల్లో అక్టోబరు 12 వరకు ఈ జాతీయ క్రీడలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు ఒలింపిక్‌ గేమ్స్‌ విజేతలు పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, రవికుమార్‌ దహియా తదితరులు పాల్గొన్నారు.

వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ క్రీడలను దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్నారు. చివరిగా 2015లో కేరళలో నిర్వహించారు. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 7000 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. 36 క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ క్రీడల్లో భాగంగా కొన్ని క్రీడాంశాల్లో పోటీలు ఆరంభమయ్యాయి. కానీ అధికారికంగా గురువారం మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రీడలకు గుజరాత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని