Tokyo Olympics: ‘ఛీర్‌4ఇండియా’ అంటోన్న మోదీ

మొత్తం 115 మంది భారత క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు

Published : 06 Jul 2021 01:00 IST

 

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌.. ప్రపంచమంతా ఈ అంతర్జాతీయ పోటీల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఇంకో 18రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన వీడియోను కేంద్రా క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ట్విటర్‌లో పోస్టు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే  క్రీడాకారులకు మద్దతుగా ఉంటామని, ఛీర్‌4ఇండియా అని మూడు సార్లు అన్నారు.  అంతేకాకుండా ప్రముఖ గాయకుడు మోహిత్‌చౌహన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారులకు మద్దతుగా ‘లక్ష్య తేరా సామ్నే హై’ (లక్ష్యం మీ ముందే ఉంది) అనే స్ఫూర్తిదాయకమైన గీతాన్ని ఆలపించగా దాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. కాగా గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. వైరస్‌ ఉద్ధృతి కాస్త నెమ్మదించడంతో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ ఈ జపాన్‌ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌ కొవిడ్‌ నియమ నిబంధనలతో జరగనున్నాయి. మొత్తం 115 మంది భారత క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని