ఒకే ఓవర్‌లో అర్జున్‌ తెందుల్కర్‌ 5 సిక్సర్లు

సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ 73వ పోలీస్‌ ఇన్విటేషన్‌ షీల్డ్‌ టోర్నీలో ఆల్‌రౌండ్‌ షోతో సత్తాచాటాడు. ఎంఐజీ జట్టు తరఫున....

Published : 15 Feb 2021 01:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ 73వ పోలీస్‌ ఇన్విటేషన్‌ షీల్డ్‌ టోర్నీలో ఆల్‌రౌండ్‌ షోతో సత్తాచాటాడు. ఎంఐజీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. ఇస్లాం జింఖానాతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. 31 బంతుల్లో 77 పరుగులతో బాదడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిత్తుచేశాడు. అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు సాధించాడు. స్పిన్నర్‌ హషీర్‌ వేసిన ఓ ఓవర్‌లో అయిదు సిక్సర్లు బాదడం గమనార్హం.

అర్జున్‌తో పాటు కెవిన్‌ (96), ప్రగ్నేష్‌ (112) సత్తాచాటడంతో ఎంఐజీ జట్టు 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు 41.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ముంబయి క్రికెట్ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ కరోనా విరామం తర్వాత ముంబయిలో జరిగిన తొలి క్రికెట్‌ పోటీగా నిలిచింది. అర్జున్‌ ఇటీవల సయ్యద్‌ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గురువారం జరగనున్న ఐపీఎల్‌ వేలంలోనూ అతడు ఉన్నాడు.

ఇవీ చదవండి

అ‘స్పిన్’‌ ఉచ్చులో ఇంగ్లాండ్‌ విలవిల 

అశ్విన్‌ రికార్డుల పరంపర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని