Badminton: బీడబ్ల్యూఎఫ్‌ అవార్డుకు ప్రమోద్‌ పేరు

టోక్యో పారాలింపిక్స్‌ ఛాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ పేరును ‘పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’కు బీడబ్ల్యూఎఫ్‌ సిఫార్సు చేసింది. టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3

Updated : 12 Nov 2021 08:37 IST

దిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌ ఛాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ పేరును ‘పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’కు బీడబ్ల్యూఎఫ్‌ సిఫార్సు చేసింది. టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో ప్రమోద్‌ విజేతగా నిలిచాడు. ఈ విభాగంలో అతను ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్‌ కూడా. కొత్తగా ప్రవేశపెట్టిన ‘పెయిర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు’కు ప్రమోద్‌, మనోజ్‌ సర్కార్‌ల పేర్లను బీడబ్ల్యూఎఫ్‌ నామినేట్‌ చేసింది. టోక్యో పారాలింపిక్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో మనోజ్‌ కాంస్య పతకం సాధించాడు. సాధారణ క్రీడాకారుల అవార్డు నామినీల జాబితాలో భారత క్రీడాకారులకు చోటు దక్కలేదు. పురుషుల విభాగంలో అక్సెల్సెన్‌, ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌), వాంగ్‌ ల్యు (చైనా), వతనబె (జపాన్‌).. మహిళల్లో యుఫెయ్‌ (చైనా), మారీన్‌ (స్పెయిన్‌), తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), యమగూచి (జపాన్‌)లు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. డిసెంబరులో బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతలను ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు