Prasidh Krishna: ఆరోన్‌ ఫించ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణల మధ్య మాటల యుద్ధం.. నెటిజన్ల ఆగ్రహం

కోల్‌కతా ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌తో మాటలతూటాలు పేల్చిన నేపథ్యంలో రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు...

Updated : 19 Apr 2022 10:47 IST

(Photos: Aaron Finch and Prasidh Krishna Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌తో మాటల యుద్ధానికి దిగిన రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు. గతరాత్రి రాజస్థాన్‌ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 210 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఔటైనా.. మరో ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (58), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (85) ధాటిగా ఆడారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 9 ఓవర్లకే 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రసిద్ధ్‌ వేసిన ఆ ఓవర్‌ చివరి బంతికి ఫించ్‌ ఔటయ్యాడు.

ఆ సమయంలో కోల్‌కతా ఓపెనర్‌ పెవిలియన్‌కు వెళ్తుండగా ప్రసిద్ధ్‌ను చూస్తూ ఏవో మాటలు అన్నాడు. దీంతో వెంటనే స్పందించిన రాజస్థాన్‌ పేసర్‌ కూడా దీటుగా స్పందిస్తూ కోపంగా ఏవో మాటలు అన్నాడు. అయితే, వారు ఏమనుకున్నారో బయటకు తెలియరాలేదు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే.. నెటిజన్లు  మాత్రం ప్రసిద్ధ్‌పై మండిపడుతున్నారు. అతడి బౌలింగ్‌పైనా విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఫించ్‌, శ్రేయస్‌ ఔటయ్యాక కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా 3 పరుగులే చేసి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయారు. అలా రాజస్థాన్‌ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని