Pravin Tambe : ప్రవీణ్ తాంబే బయోపిక్‌.. కోల్‌కతా ఆటగాళ్ల భావోద్వేగం

కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం మాత్రమే...

Published : 01 Apr 2022 21:15 IST

ట్విటర్‌లో షేర్‌ చేసిన కోల్‌కతా యాజమాన్యం

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రవీణ్‌ తాంబే.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. 41 ఏళ్ల వయసులో టీ20 లీగ్‌లో ఆడిన ప్లేయర్‌. కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం మాత్రమే తాంబే సొంతం. అలాంటిది రాజస్థాన్‌, ముంబయి, గుజరాత్‌ లయన్స్, హైదరాబాద్‌ జట్ల తరఫున తాంబే కొన్ని టీ20 మ్యాచ్‌లను ఆడటం విశేషం. మరి ఇప్పుడెందుకు వార్తల్లో నిలిచారనేగా మీ డౌట్..? 

క్రికెట్‌ కోసం చిన్నప్పటి నుంచి కష్టపడిన ప్రవీణ్‌ తాంబే ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే భారత జట్టు తరఫున ఆడలేకపోయినా సరే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టీ20 లీగ్‌లో మాత్రం కాంట్రాక్ట్‌ను సంపాదించాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రవీణ్‌ తాంబే బయోపిక్‌ ‘కౌన్‌ ప్రవీణ్‌ తాంబే?’ హాట్‌స్టార్‌లో ఇవాళ (ఏప్రిల్ 1) విడుదలైంది. నిన్న కోల్‌కతా ఆటగాళ్ల కోసం ప్రత్యేక షోను యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ తాంబే భావోద్వేగానికి లోనయ్యాడు. కోల్‌కతా ప్లేయర్లు తాంబేను అభినందిస్తూ సందేశం ఇచ్చారు. ఈ వీడియోను కోల్‌కతా యాజమాన్యం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని