IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రత్యక్షంగా వీక్షించనున్నారని సమాచారం. 

Published : 02 Feb 2023 21:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా, ఆసీస్‌ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు బెంగళూరులో సాధన చేస్తోంది. తొలి టెస్టు నాగ్‌పుర్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లో భాగంగా మార్చి 9-13 మధ్య నాలుగో టెస్టును నిర్వహించనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendera Modi) స్టేడియానికి ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని సమాచారం. 

భారత్, ఆసీస్‌ నాలుగు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్ 

  • ఫిబ్రవరి 9-13 - మొదటి టెస్టు (నాగ్‌పూర్‌) 
  • ఫిబ్రవరి 17-21 - రెండో టెస్టు (దిల్లీ) 
  • మార్చి 1-5 - మూడో టెస్టు (ధర్మశాల) 
  • మార్చి 9-13 - నాలుగో టెస్టు (అహ్మదాబాద్‌)    
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు