IPL 2022: అలా చేస్తే మీ కర్మ .. పృథ్వీ షా ఘాటు వ్యాఖ్యలు

తన గురించి తెలియనప్పుడు ఒక అంచనాకు రావద్దని దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా అంటున్నాడు. ఇటీవల ఐపీఎల్‌-15వ సీజన్‌ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన...

Published : 18 Mar 2022 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన గురించి తెలియనప్పుడు ఒక అంచనాకు రావద్దని దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా అంటున్నాడు. ఇటీవల ఐపీఎల్‌-15వ సీజన్‌ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన యోయో పరీక్షలో అతడు విఫలమైన సంగతి తెలిసిందే. ఆ ఫిట్‌నెస్‌ పరీక్షలో ఆటగాళ్లు అర్హత సాధించాలంటే కనీసం 16.5 పాయింట్లు సాధించాలి. అయితే, పృథ్వీ 15 పాయింట్లే సాధించాడు. దీంతో అతడు ఐపీఎల్‌లో ఆడలేడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన పృథ్వీ తన స్టోరీస్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అవి నెటిజన్ల కంట పడటంతో ఆ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘నా పరిస్థితులేంటో తెలియనప్పుడు దయచేసి నా గురించి ఒక అంచనాకు రాకండి. నన్ను నిందించకండి. అలా చేస్తే మీ కర్మ మీరే బాధ్యులు అవుతారు’ అని పృథ్వీ పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై స్పందించిన దిల్లీ యాజమాన్యంలోని ఓ అధికారి.. యోయో పరీక్షతో ఐపీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ అప్‌డేట్‌ తెలియజేస్తుందని, పృథ్వీని దిల్లీ తరఫున ఆడనివ్వకుండా చేయదని చెప్పారు. అతడు వరుసగా మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేసరికి ఫిట్‌నెస్‌లో మార్పులు చోటు చేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక దిల్లీ యాజమాన్యం గతేడాది రిటెన్షన్‌ ఆటగాళ్ల జాబితాలో రిషభ్ పంత్‌, అక్షర్‌ పటేల్‌, అన్‌రిచ్‌ నార్జ్‌తో సహా పృథ్వీని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఈసారి ఐపీఎల్‌ ఆడతాడో లేదో అధికారికంగా తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని