
Lock down:పృథ్వీ షాను అడ్డుకున్న పోలీసులు
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో వైరస్ కట్టడికి కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు కొన్ని మినహాయింపులు ఇచ్చి కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ-పాస్‌లు ఉంటేనే ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తున్నారు. అయితే, ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించిన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు చేదు అనుభవం ఎదురైంది.
బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనాబారినపడటంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు. పృథ్వీ షా కూడా ముంబయిలోని తన నివాసానికి చేరుకున్నాడు. అయితే, వచ్చేనెలలో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్, అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీంతో గోవాలో వేసవి విడిది చేసేందుకు పృథ్వీ షా తన కారులో బయలుదేరాడు. కాగా, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో పోలీసులు అతడి కారును అడ్డుకున్నారు. ప్రయాణానికి అనుమతించకపోవడంతో ఆన్‌లైన్‌లో ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకన్నాడు. గంట తర్వాత ఈ-పాస్ అనుమతి లభించింది. దీంతో పృథ్వీ షా అక్కడి నుంచి గోవా బయలుదేరాడు. అయితే అంతకముందే పృథ్వీ ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది జారీ కాకముందే బయలుదేరాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.