Ishan Kishan: నా బ్యాట్‌పై అతడి ఆటోగ్రాఫ్.. జీవితంలో మరచిపోలేని సందర్భం: ఇషాన్ కిషన్
భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ తన జీవితంలోని మధురమైన క్షణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ తన జీవితంలోని మధురమైన క్షణాల గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తన బ్యాట్‌పై భారత మాజీ కెప్టెన్ ధోనీ సంతకం పెట్టడం మరచిపోలేని సందర్భమని తెలిపాడు. ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు చెందిన ఇషాన్.. క్రికెట్‌లో తాను ఎక్కువగా ధోనీని ఆరాధిస్తానని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది.
‘‘నేను చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీని ఆరాధిస్తూనే పెరిగా. నేను మొదటిసారి ధోనీని చూసినప్పుడు నా వయసు 18 ఏళ్లు. అప్పుడు అతడిని ఆటోగ్రాఫ్ అడిగా. నా బ్యాట్‌పై అతడి ఆటోగ్రాఫ్ చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఆ సందర్భాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. నేనూ అతడిలా అద్భుతంగా రాణించడానికి కృషి చేస్తా’’ అని ఇషాన్ పేర్కొన్నాడు.
వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా అద్బుతంగా రాణిస్తున్నఇషాన్ కిషన్ ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో అతడు అత్యంత వేగంగా ద్విశతకం(131 బంతుల్లో 210) సాధించిన విషయం తెలిసిందే. ఇషాన్ ఇప్పటివరకు 13 వన్డేలు ఆడి 507 పరుగులు చేశాడు. టీ20ల్లో 24 మ్యాచులు ఆడి 629 పరుగులు సాధించాడు. అందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇషాన్ పుట్టింది పట్నాలోనే అయిన పెరిగింది మాత్రం ఝార్ఖండ్‌లో. దీంతో అతడు ధోనీపై అమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Lionel Messi: మెస్సికి అరుదైన గౌరవం.. ఫుట్‌బాల్ దిగ్గజాల సరసన విగ్రహం
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’