Sushil Kumar: సైకాలజిస్టులతో ప్రశ్నల వర్షం

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అరెస్టైన సుశీల్‌ కుమార్‌ కథ అనేక మలుపులు తిరుగుతోంది. విచారణకు సహకరించని అతడితో నోరు విప్పించేందుకు దిల్లీ క్రైమ్‌...

Published : 27 May 2021 15:32 IST

విచారణలో భయపడ్డ సుశీల్‌ కుమార్‌!

దిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అరెస్టైన సుశీల్‌ కుమార్‌ కథ అనేక మలుపులు తిరుగుతోంది. విచారణకు సహకరించని అతడితో నోరు విప్పించేందుకు దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పలు విధాలుగా శ్రమిస్తున్నారు. అతడిని విచారించేందుకు మానసిక వైద్యనిపుణుల సాయం తీసుకున్నట్టు సమాచారం. ఇంటరాగేషన్‌లో ఆ నిపుణులు అడిగిన ప్రశ్నలకు సుశీల్‌ భయపడ్డాడట. అందుకే విచారణను తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు వర్గాల సమాచారం.

రాణాపై దాడి సంఘటనలో ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. ఎనిమిది మంది నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారని తెలిసింది. వారంతా సుశీల్‌కు వ్యతిరేకంగా చెప్పినట్టు సమాచారం. ఛత్రసాల్‌ ఘటన, దాడి సమయంలో దాచిపెట్టిన సెల్‌ఫోన్‌ గురించి సుశీల్‌ పోలీసులకు చెప్పాడట. అతడికి గ్యాంగ్‌స్టర్లతో ఉన్న సంబంధాల గురించి అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ కాలా జతేదీ సోదరుడు ప్రదీప్‌తో  2018, డిసెంబర్‌18న దిగిన పాత చిత్రాలు ప్రస్తుతం బయటపడ్డాయి. ప్రదీప్‌ తలపై రూ.7లక్షల బహుమానం ఉందని, విదేశాలకు పారిపోయాడని పోలీసులు తెలిపారు.

హత్యకేసులో సుశీల్‌ కుమార్‌పై మీడియా విచారణ కొనసాగుతోందని, అది వెంటనే ఆపేయాలని కోరుతూ ఓ న్యాయశాస్త్ర విద్యార్థి దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు  సుశీల్‌ తల్లి అనుమతి లేదని, ప్రచారం కోసమే అతడాపని చేశారని తెలుస్తోంది. ‘కోర్టు విచారణకు ముందే అనుమానితుడు లేదా నిందితుడిపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనివల్ల అతడి వ్యక్తిత్వంపై ప్రభావం పడుతుంది. అందుకే మీడియా ట్రయల్స్‌ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషన్‌లో ఆ విద్యార్థి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు