Curran: కరన్‌ కోసం ఎందుకంత భారీ మొత్తం..? పంజాబ్‌ సహ యజమాని సమాధానమిదే..!

ఐపీఎల్ (ipl) మినీ వేలంలో సంచలనంగా మారాడు శామ్ కరన్. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్ టీ20 ప్రపంచకప్‌ ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే.

Published : 24 Dec 2022 01:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ (ipl) మినీ వేలంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు శామ్‌ కరన్‌ (sam curran) రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను సొంతం చేసుకొన్న ఆటగాడిగా నిలిచాడు. ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ పంజాబ్‌ కింగ్స్‌ (pbks) రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పెట్టినప్పుడు పంజాబ్‌కే కరన్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి వచ్చేస్తున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కరన్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి గల కారణాలను పంజాబ్‌ కింగ్స్‌ డైరెక్టర్‌, సహ వ్యవస్థాపకుడు నెస్ వాడియా వెల్లడించారు.

‘‘మా వద్ద తగినంత మొత్తం ఉండటంతోనే శామ్ కరన్‌ను దక్కించుకొన్నాం. కరన్‌ మళ్లీ మాతో కలవడం ఆనందంగా ఉంది. గతంలోనే కరన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాం. అయితే అప్పుడు చెన్నై దక్కించుకొంది. ఇప్పుడు మళ్లీ వేలంలో మా సొంతమయ్యాడు. 24 ఏళ్ల శామ్‌ కరన్ ప్రపంచశ్రేణి ఆటగాడు. అలాగే సికిందర్‌ రజాను సొంతం చేసుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో రాణిస్తాడనే నమ్మకం ఉంది’’ అని నెస్‌ వాడియా తెలిపారు.

మోరిస్‌ రికార్డును అధిగమించి..

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ 2021 సీజన్‌లో రూ.16.25 కోట్లను దక్కించుకొని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు శామ్‌ కరన్‌ అంతకంటే ఎక్కువ మొత్తం సొంతం చేసుకోవడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ 2022లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం కరన్‌కు కలిసొచ్చిందని నిపుణులు అంచనా వేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు