రాహుల్‌ విధ్వంసం: RCB ముందు భారీ లక్ష్యం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది...

Updated : 30 Apr 2021 21:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(91 నాటౌట్‌; 57 బంతుల్లో 7x4, 5x6) మరోసారి దంచికొట్టాడు. అతడికి క్రిస్‌గేల్‌(46;  24 బంతుల్లో 6x4, 2x6), హర్‌ప్రీత్‌బ్రార్‌(25; 17 బంతుల్లో 1x4, 2x6) సహకరించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఇక బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా చాహల్‌, సామ్స్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని